మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా?!

ఉప్పేస్కో.. నూనేస్కో.. ఎగ్గేస్కో.. స్వీట్‌కార్నేస్కో..! మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా.. వాటి వాడివేడి నాటు దెబ్బ సూద్దువా? మేఘాలన్నీ కమ్మేసుకున్నాయ్.. మబ్బుల్లోంచి చిరుజల్లులు రాలుతున్నాయ్.. ఈ చల్లచల్లని ఎట్మాస్పియర్‌లో.. వేడివేడి మొక్కజొన్న కంకులు తింటే ఎట్లా ఉంటుంది? మొక్కజొన్న వెరైటీలను ఈ రెయినీ సీజన్‌లో టచ్ చేయాలని నోరూరుతుందా?

లేట్ చేస్తే నోటికాడి స్వీట్‌కార్న్ వానదొంగలు ఎత్తుకెళ్లినా ఆశ్చర్యం లేదు. వెళ్లి స్వీటు కార్న్ నాటు రుచి చూడండి!


స్వీట్ కార్న్ డిలైట్
కావలిసిన పదార్థాలు : స్వీట్ కార్న్ : 2 1/2 కప్పులు కోడిగుడ్లు : 5 బేకింగ్ పౌడర్ : అర టీస్పూన్ క్యాన్డ్ క్రీమ్ కార్న్ : ఒక కప్పు మైదా : 1/3 కప్పు పాలు : 1 1/2 కప్పులు హెవీ క్రీమ్ : 1 1/2 కప్పులు ఉప్పు : అర టీస్పూన్

తయారీ : మైక్రో ఓవెన్‌ని 375 డిగ్రీల వద్ద వేడి చేసి పెట్టుకోవాలి. స్వీట్ కార్న్‌లో కొద్దిగా నీళ్లు పోసి, ఉప్పు వేసి ఉడికించాలి. గ్లాస్ షేప్ బేకింగ్ డిష్‌ని తీసుకొని అందులో స్వీట్ కార్న్, క్రీమ్డ్ కార్న్, పాలు, మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. దీన్ని ఓవెన్‌లో గంటపాటు బేక్ చేయాలి. అది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బయటకు తీయాలి. వేడివేడిగా టేస్ట్ చేస్తే డిలైట్ అదిరిపోతుంది.

కార్న్ చిల్లీ మసాలా
కావలసిన పదార్థాలు :-  మొక్కజొన్న గింజలు : 2 కప్పులు, టమాటా : 3, సొరకాయ ముక్కలు : ఒక కప్పు, క్యాప్సికమ్ : 1, జీడిపప్పు : 2 టేబుల్‌స్పూన్స్, పచ్చిమిర్చి : 2, అల్లం : చిన్నముక్క, మెంతికూర : కొద్దిగా, గరంమసాలా : ఒక టీస్పూన్, కారం : ఒక టీస్పూన్, పసుపు : అర టీస్పూన్, ఉప్పు : ఒక టీస్పూన్, చక్కెర : ఒక టీస్పూన్, నూనె : మూడు టేబుల్‌స్పూన్స్

తయారీ :-  కుక్కర్లో మొక్కజొన్న గింజలు వేసి, నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. టమాటా, సొరకాయ ముక్కలను చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి. మరో కుక్కర్‌లో నూనె పోసి టమాటా, సొరకాయ ముక్కలు, జీడిపప్పు వేసి వేయించాలి. రెండు టేబుల్‌స్పూన్ల నీళ్లు పోసి మూత పెట్టేయాలి. రెండు విజిల్స్ వచ్చాక దించేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి క్యాప్సికం వేసి వేయించాలి. ఇందులో అల్లం, ఉడికించిన కార్న్ వేసి కొద్దిసేపు కలపాలి. దీంట్లో మెంతికూర, గరం మసాలా, టమాటా పేస్ట్ వేసి కలపాలి. కొద్దిగా వేగాక పావు కప్పు నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా చక్కెర, ఉప్పు వేసి కలుపుకొని దించేయాలి. అంతే.. వేడివేడి కార్న్ చిల్లీ మసాలా మీ నోరూరించక మానదు!

కార్న్ అండ్ పొటాటో సూప్
కావలసిన పదార్థాలు :- మొక్కజొన్న గింజలు : 2 1/2 కప్పులు, ఆలుగడ్డ ముక్కలు : 2 కప్పులు, వెన్న : ఒక టేబుల్‌స్పూన్, ఉల్లిగడ్డ ముక్కలు : పావు కప్పు, మిరియాలపొడి : పావు టీస్పూన్, పాలు : 2 కప్పులు మైదా : ఒక టేబుల్‌స్పూన్ ఉప్పు : తగినంత potato-corn-chowder

తయారీ : మొక్కజొన్న గింజలను నీళ్లు, ఉప్పు వేసి ఉడికించాలి. ఇందులోనే ఆలుగడ్డ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, మైదా, మిరియాలపొడి, వెన్న, కొన్ని నీళ్లు పోసి మళ్లీ ఉడికించాలి. పదినిమిషాల తర్వాత పాలు పోసి కలిపి అలాగే ఉడకనివ్వాలి. చివరగా ఉప్పు వేసి దించేయాలి. చిరుజల్లుల్లో ఈ చిక్కటి సూప్ టేస్టీగా లాగించేయొచ్చు.

No comments:

Post a Comment