ఓ బదల్‌గయా..నయా జిందగీ ఆగయా..

జూన్ 2.. మాట...
జిందగీ బదల్‌గయా అంటే ఏమిటో చెప్పనక్కర్లేదు. తెలంగాణది గత ఏడాదికి ఒక్క రోజు ముందు కూడా విధ్వంస ముఖచిత్రమే. వలస పాలనలో తన అస్తిత్వం కోల్పోయి స్వేచ్ఛ కోసం, స్వాతంత్య్రం కోసం, స్వయం పాలనకోసం సుదీర్ఘకాలం వేచి చూసింది. అవిశ్రాంతంగా పోరాడింది. మలిదశ ఉద్యమంతో ఆ పోరాటానికి తెరపడింది. జూన్ రెండుతో ఆ పరపీడన ఘడియలు ముగిసి పోయాయి. చరిత్రలోకి అడుగుపెట్టి, స్వహస్తాలతో మన బతుకు చిత్రాన్ని లిఖించుకుంటోంది. శాంతిని పొందింది. సౌఖ్యం కోసం తపన పడుతోంది. జమానా బదల్‌గయా అని స్వయం పాలనతో నిరూపిస్తోంది.

మలిదశ ఉద్యమం మహిమ అది. జిందగీ బదల్‌గయా అని ఎలుగెత్తి చాటే సంవత్సరం ఇది. అంతకుముందు సకల జనుల చేతనతో, వందలాది బిడ్డల బలిదానాలతో తెలంగాణ ఒక పాటశాలే అయింది. అహింసాయుతంగా పోరాడి స్వరాష్ర్టాన్ని సాధించుకోగానే ప్రభుత్వం మొక్కవోని సంకల్పంతో బంగారు తెలంగాణకోసం పునరంకితం అయింది. రాజకీయ పరిష్కారం పొందిన మరుక్షణం నుంచే ఉద్యమ కాలంలో చేసిన ప్రమాణాలను అమలు చేస్తోంది. అమరుల కుటుంబాలను ఆదుకుంది. పాటగాళ్లకు పట్టాభిషేకం చేసింది. చెరువు, కుంటలను బాగు చేయడానికి పూనిక వహించింది. విధ్వంసం నుంచి పునర్నిర్మాణానికి అహర్నిశలూ శ్రమిస్తోంది. ఒకటని కాదు, పేరుపేరునా వాటిని ప్రస్తావించడానికి బదులు ఒక్క మాట చెబుతున్నం -జిందగీ బదల్‌గయా.

ఎలా, ఏమిటో ప్రజలకు తెలుసు. జిందగీ ఆ మంచినీ, మార్పునూ మరింత సన్నిహితంగా ఆవిష్కరిస్తుందని ప్రామిస్ చేస్తూ...పాఠకులకు రాష్ర్టావతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

గంజిమెతుకులే దిక్కయిన ఓ అవ్వకు ఆసరా దొరికింది..బీడీలు చుట్టే ఓ అక్కకు భృతి చేరువైంది..పెళ్లికి స్థోమత లేని ఓ చెల్లికి కల్యాణ భాగ్యం కలిగింది.. మెరిగలబువ్వ తిన్న ఓ చిన్నారి సన్న బువ్వతో సక్కగా సదువుతోంది! హమారా జాన్.. హమారా జమీన్.. హమారా సర్కార్! అబ్ నయా జిందగీ ఆగయా!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక క్రీడాకారులకు ఏ ప్రభుత్వం చేయని సాయం ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చేశారు. సానియా, సైనాలతో పాటు నాకు కూడా 50 లక్షల రూపాయలు ప్రోత్సాహం కింద ఇచ్చారు. ఈ ప్రోత్సాహం వల్లే సానియా మిర్జా, సైనా నెహ్వాల్ వరల్డ్ నెంబర్ వన్‌గా నిలబడ్డారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే చాలా అభివృద్ధి కనిపిస్తోంది. క్రీడాకారులకు ప్రోత్సాహకాలిచ్చి చరిత్రలో నిలిచిపోయే గొప్ప పనిచేశారు. దీని వల్ల భవిష్యత్తులో మరింత మంది ఆణిముత్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వాల పాలనలో ఎండాకాలం అసలు కరెంట్ ఉండేది కాదు. తెలంగాణ ప్రభుత్వ పాలనలో రోజులో ఒక సారి కూడా కరెంట్ కోతలేదు. నిజంగా క్రీడాకారులకిది గొప్ప సంవత్సరం.

No comments:

Post a Comment