జిల్లా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను స్థానికనేతల అభీష్ఠాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా అభ్యర్థులను ఖరారుచేసింది. జిల్లాలోని 14 అసెంబ్లీస్థానాలలో ఐదు స్థానాలను బీసీలకు కేటాయించింది. సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పిన కాంగ్రెస్ మాటనెరవేర్చుకోలేదు. జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలైన చేవెళ్ల, మల్కాజిగిరిలను స్థానికేతరులైన ఎస్.జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణలకు కట్టబెట్టింది. మహిళల్లో ఒక్క సబితారెడ్డికే టిక్కెట్టు ఇవ్వగా, మైనార్టీలకు మొండిచెయ్యి చూపింది. బీసీల్లో ముదిరాజ్ కులస్థులకే మూడుస్థానాలను కేటాయించింది. బీసీలకు ఐదుస్థానాలను కేటాయించి సముచితస్థానం కల్పించినా మూడుస్థానాల్లో ముదిరాజ్ కులానికి చెందిన వారికి ఇవ్వడంతో మిగతా సామాజిక వర్గాల వారు అసంతృప్తితో ఉన్నారు. మంత్రి సబితారెడ్డిని మహేశ్వరం అభ్యర్థిగా ఖరారుచేయగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎం ప్రతాప్‌ను కుత్బుల్లాపూర్ అభ్యర్థిగా, వికారాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ను మళ్లీ ఖరారుచేసింది. చేవెళ్ల టిక్కెట్‌ను ఊహించని విధంగా టీటీడీ బోర్డు సభ్యుడు కే.యాదయ్యను ఖరారుచేసింది. స్థానికనేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడమే కాకుండా, అన్ని వర్గాలకు ప్రాధాన్యతనివ్వడంలోను అధిష్ఠానం తీవ్ర అన్యాయం చేసిందని, పనిచేసే వారికి కాకుండా బడానేతల ఒత్తిడి మేరకే అభ్యర్థులను ఎంపిక చేశారని కాంగ్రెస్‌నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.జిల్లాలో ఆయా నియోజక వర్గాలకు కేటాయించిన సామాజిక వర్గ వ్యక్తులను ఒకసారి చూద్దాం..
పార్లమెంట్ స్థానాలు
చేవెళ్ల- ఎస్ జైపాల్‌రెడ్డి(రెడ్డి)
మల్కాజిగిరి-సర్వే సత్యనారాయణ(ఎస్సీ,మాదిగ)
అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు
మహేశ్వరం- పి.సబితారెడ్డి(రెడ్డి)
చేవెళ్ల(ఎస్సీ)-కే.యాదయ్య(ఎస్సీ మాదిగ)
తాండూరు-ఎం.రమేష్ ముదిరాజ్ (బీసీ)
పరిగి-కమతం రామిరెడ్డి(రెడ్డి)
వికారాబాద్(ఎస్సీ)-జి.ప్రసాద్‌కుమార్(ఎస్సీ, మాల)
మేడ్చెల్-కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(రెడ్డి)
ఇబ్రహీంపట్నం-మల్‌రెడ్డిరంగారెడ్డి(రెడ్డి)
కుత్బుల్లాపూర్-కేఎం ప్రతాప్‌గౌడ్ (బీసీ)
రాజేంద్రనగర్-బి.జ్ఞానేశ్వర్‌ముదిరాజ్ (బీసీ)
ఎల్‌బీనగర్-దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(రెడ్డి)
శేరిలింగంపల్లి-బిక్షపతియాదవ్(బీసీ)
ఉప్పల్- బి.రాజిరెడ్డి(రెడ్డి)
కూకట్‌పల్లి-వడ్డెపల్లి నర్సింగ్‌రావు(వెలమ)
మల్కాజిగిరి-ఆకుల రాజేందర్ ముదిరాజ్(బీసీ)
జాబితాలు రెడీ.. ప్రకటనకు గజ..గజ!!
ఎన్నికల తేదీలు దగ్గరపడుతుండడంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు బరిలో నిలిపే అభ్యర్థుల జాబితాలను దాదాపు పూర్తి చేశాయి. కానీ ఎవ్వరూ మా జాబితా ఇది అని ధైర్యంగా ప్రకటించలేకపోతున్నారు. అధికార కాంగ్రెస్‌తో సహా టీడీపీ, పీఆర్పీ, వామపక్షాలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేకపోతున్నాయి. భారతీయ జనతా పార్టీ, లోక్‌సత్తా పార్టీలు మాత్రమే మున్ముందుగా అధికారిక జాబితాలో కొన్ని పేర్లయినా విడుదల చేశాయి. ప్రజారాజ్యం పార్టీకి మాత్రం ముందుగా ఎవరైనా విడుదల చేస్తే, టికెట్లు రానివారు తమవైపు చూడక పోతారా అన్నట్లు ఉంది. మిగిలిన పార్టీలన్నీ తాము కాకుండా ఎవరు ముందు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నాయి. దీనికి ఒకే కారణం...తాము ముందే చిట్టా విప్పితే...నిరాశా జీవులు గోడ దూకుతారేమో అనే వణుకుతోనే అన్ని పార్టీలూ ప్రకటించిన తర్వాత విడుదల చేస్తే దాన్ని నివారించవచ్చునేమో అన్న ఆశ. ఇటు టికెట్లు ఆశిస్తున్న వారు మాత్రం అభ్యర్థిని ప్రకటిస్తే ప్రచారంపై దృష్టిపెట్టవచ్చని చూస్తున్నారు.
కాంగ్రెస్ ధీమా...
ఐదేళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత లేదని మళ్లీ అధికారం తమదే అని నమ్ముతోంది. అయితే కొన్నికారణాల వల్ల 70 మంది సిట్టింగ్‌లకు టికెట్లు లభించే సూచనలు లేవు. ఎన్నికల వేళ ఎప్పుడు ఏమవుతుందో అనే ఆలోచనతో కూడిన వణుకు కాంగ్రెస్ నాయకత్వానికి లోలోపల ఉంది సిట్టింగు ఎమ్మెల్యేలను మార్చక తప్పకపోవడంతో టికెట్లు రాని వారు ఇండిపెండెంట్లుగా, మరో పార్టీ తరఫున పోటీచేసి గెలిచే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ జాబితా విడుదల వాయిదా వేసింది. అలాగే టీఆర్‌ఎస్ అసమ్మతి ఎమ్మెల్యేలుగా ఉండి, కాంగ్రెస్‌కు సన్నిహితంగా మెలిగిన దుగ్యాల శ్రీనివాసరావు, జగ్గారెడ్డి లేదా ఆయన సతీమణి లాంటి వారికి సైతం టికెట్లు ఖాయమయ్యాయన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అలాంటి వారందరికీ టికెట్లు ఇచ్చినట్టు వెంటనే అధికారికంగా ప్రకటిస్తే లేనిపోని తలనొప్పులు చుట్టుకుంటాయన్న ఆందోళన కాంగ్రెస్ నాయకత్వాన్ని వెంటాడుతున్నది. తుది కసరత్తు పూర్తి చేసిన తర్వాత అధినేత్రి సోనియాగాంధీ అంగీకారంతో ఈనెల 23న జాబితా విడుదల చేస్తామని డిఎస్, వైఎస్ చెబుతున్నారు.
సర్ధుబాటులో కూటమి...
ఇక ఎలాగైనా కాంగ్రెస్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఏకమైన టిఆర్‌ఎస్, సిపిఎం, సిపిఐ నాయకత్వాలు ఎడతెగని సర్దుబాటు చర్చలు సాగిస్తూ, వాటి ఫలితాలు తేలక సతమతమవుతున్నాయి. అంతర్గతంగా పార్టీ జాబితాలు రూపొందించు కోవటం, సర్దుబాట్ల కారణంగా టికెట్లు ఇవ్వలేని వారిని అనునయ వాక్యాలతో ఈ ఒక్కసారి సర్దుకొమ్మని చెప్పి పని చేయించుకోవటం వంటి పనులు టిడిపి, టిఆర్‌ఎస్‌కు అదనంగా ఉంటాయి. జెండా మోసిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చినా నాయకత్వాలు వినకుండా కొత్తగా పార్టీలోకి దూకిన వారికి అవకాశాలు ఇస్తున్నారన్న ఆక్రోశం నాయకులలో కలుగుతున్నది. ఈ పరిణామాలన్నిటినీ గమనిస్తున్న కూటమి నాయకత్వాలు కాంగ్రెస్, పిఆర్పీ జాబితాలను చూసిన తర్వాతే విడుదల చేయాలని కూటమి నాయకత్వాలు భావిస్తున్నట్టు సమాచారం. ఈనెల 22న లేదా ఆ తర్వాత జాబితాలను విడుదల చేయాలని, ఆ లోగా అంతర్గతంగా సర్దుబాట్లు పూర్తి చేసుకోవాలని కూటమి నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.
జంపింగ్‌ల కోసం పీఆర్పీ...
కాంగ్రెస్, కూటమి జాబితాల పంచాయతీ తెగితే టికెట్లు రాని వారంతా తమ పార్టీ వైపు దూకటం ఖాయమని పిఆర్పీ ఎదురు చూస్తున్నది. అనేక జిల్లాల్లో మహాకూటమి, కాంగ్రెస్ అభ్యర్థులను ఢీకొనగలిగిన నేతలు ఇంకా అందుబాటులోకి రాకపోవటంతో రెండు వైపులనుంచి టికెట్లు రానివారికి గాలం వేయ వచ్చునని పిఆర్పీ నాయకత్వం ఆశిస్తున్నది. ఇప్పటి వరకు చిరంజీవి ప్రజాఅంకిత యాత్రలో ముగ్గురి పేర్లు అధికారికంగా ప్రకటించారు. అనుకున్నట్టు జరిగితే ఈ నెల 23న లేదా తర్వాత జాబితా విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
బీజెపీ, లోక్‌సత్తాలే నయం..
జాబితాల విడుదల విషయంలో బిజెపి, లోక్‌సత్తా కొంతలో కొంత నయం. బిజెపి ఇప్పటిదాక 100 అసెంబ్లీ, 15 లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ నెల 23 నాటికి పూర్తి స్థాయి జాబితా విడుదల చేస్తామని బిజెపి అంటున్నది. ఇక లోక్‌సత్తా ఇప్పటిదాకా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ పేరు సహా 38 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇలా ఎవరికి వారు పక్క పార్టీని చూస్తూ కూర్చుంటే లాభం లేదని ఆశావహులు కాస్త గట్టిగానే మాట్లాడుతున్నారు. ఎన్నికలు జరగటానికి నెల రోజుల గడువు కూడా లేకపోవటంతో ఏర్పాట్లు చేసుకోవటానికి తమకు వీలు చిక్కదని, తమ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని వెంటనే జాబితాలను ప్రకటించాలని అన్ని పార్టీలలో టికెట్లు ఆశిస్తున్న వారు మొర పెట్టుకుంటున్నారు.

సీఎం సెంటిమెంట్ కలిసొచ్చేనా!!
ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నికల ప్రచార జైత్రయాత్రను ప్రారంభించారు. సెంటిమెంట్ ప్రకారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి సీఎం ప్రచారం ఆరంభించారు. మంగళవారం ఉదయం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, అంబేద్కర్, విగ్రహాలకు పైలమాలు వేసి నివాళులు అర్పించిన అనంతరం చేవెళ్లకు బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో అరె మైసమ్మ దేవాలయంలో, చిలుకూరి బాలాజీ క్షేత్రంలో ఆయన పూజలు చేయించారు. చేవెళ్లలో విజయఢంకా మోగించి ఎన్నికల శంఖారావం పూరించారు. ఆ తర్వాత వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో సీఎం పర్యటనకు బయలుదేరారు. ప్రతిసారి ఏ పథకం ప్రవేశపెట్టిన చేవెళ్ల నుండి ప్రారంభించడం తెలిసిందే. అయితే ఈ సారి ఆ సెంటిమెంట్ ఎంతమేరకు ఫలిస్తుందో చూడాల్సిందే.
ఉగాదిన పీఆర్పీలోకి పెన్మత్స?
విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీలో రేగిన అసమ్మతి జ్వాలలు చల్లారకపోగా విపక్షాలకు లాభించేలా సమీకరణలు మారుతున్నాయి. బొత్స కుటుంబానికి మూడు టిక్కెట్లు కేటాయించిన కాంగ్రెస్ పార్టీ సందిగ్ధంలో పడింది. జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు తానడిగిన ఎంపీ సీటు ఇవ్వకపోవడతో కాంగ్రెస్ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. పెన్మత్సను బుజ్జగించడానికి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకపోయింది. పెన్మత్స ప్రజారాజ్యం పార్టీలో చేరితే తానడిన సీటును ఇవ్వడానికి ఆ పార్టీ సిద్దంగా ఉంది. ఇటు సాంబశివరాజును తమవైపుకు లాగేందుకు తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. తాను ఏ పార్టీలో చేరేది ఉగాది రోజు సాంబశివరాజు పీఆర్పీ వైపు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
కాంగ్రెస్‌తో వామపక్షాల దోస్తీ: కారత్ సంకేతాలు
వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం అవసరమైతే కాంగ్రెస్‌తో దోస్తీ పెట్టుకునే అవకాశాలను సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తోసిపుచ్చలేదు. ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అసరమైతే కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతామని ప్రకటించారు. కాంగ్రెస్‌తో చర్చలు జరిపేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు.
వారితో మేము దోస్తీకి ప్రయత్నించగలమని, వారిని ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వానికి మద్దతివ్వమని కోరుచామన్నారు. ఆచరణలో ఇది సాధ్యమేనని కారత్ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. గత ఏడాది అణు ఒప్పందంపై వివాదంతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వానికి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా దూరమైన ఇరుపక్షాలు మళ్లీ దగ్గరయ్యే అవకాశం లేకపోలేదని తాజాగా కారత్ పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ నేతృత్వాల్లోని కూటములకు ప్రత్యామ్నాయంగా వామపక్ష పార్టీలు ప్రధాన ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి తృతీయ కూటమిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

మారెప్పకు ఈ సారి హుళక్కే?
వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైంది. ఈ జాబితాలో దాదాపు 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్య పేర్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. టికెట్లు దొరకని ప్రముఖుల్లో మాజీ మంత్రి మారెప్ప ఉండడం విశేషం. మారెప్పతో పాటు చాలామంది మంత్రులకు సైతం ఈ జాబితో చుక్కెదురే ఎదురైనట్లు తెలుస్తోంది. ఇటీవల బీజెపీ నుండి కాంగ్రెస్‌లో చేరిన దొరబాబుకు టికెట్ లభించినట్లు సమాచారం. దేవినేని నెహ్రూకు టికెట్ ఖాయమైనా ఏ స్థానంలో బరిలో దించాలన్న విషయం ఇంతవరకు తేలలేదు. మంత్రి కోనేరు రంగారావు తన కుమార్తెకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. మరో మంత్రి గొల్లపల్లి సూర్యారావు టికెట్‌పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో చంగారెడ్డి, కుతుహలమ్మ, కిరణ్‌కుమార్ రెడ్డి, గల్లా అరుణకు టికెట్లు లభించాయి. అయితే తిరుపతిలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పోటీ ఖాయం కావడంతో వెంకటరమణ స్థానంలో టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ చెప్పినట్లు మంత్రులకు సైతం టికెట్లు గల్లంతయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పార్లమెంట్ స్థానాల్లో మాత్రం చాలా మంది సిట్టింగులకు పట్టం కట్టిన విషయం తెలిసిందే.
ముఖేష్ ఇండిపెండెంట్‌గా పోటీ!
నియోజక వర్గాల పునర్విభనకు మంత్రులకు సైతం తలనొప్పిగా మారింది. మంత్రి ముఖేష్‌గౌడ్ కూడా సీటు కోసం నానాతంటాలు పడుతున్నారు. పునర్విభనలో ముఖేష్‌గౌడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజక వర్గం గోషామహల్‌గా ఏర్పడింది. అయితే మజ్లిస్‌కు పట్టున్న కొన్ని ప్రాంతాలు గోషామహల్‌లో చేరడంతో అక్కడి నుండి పోటీ చేయాలని మజ్లిస్ పార్టీ యోచిస్తోంది. మజ్లిస్‌తో రహస్య ఒప్పందం ప్రకారం ఆ పార్టీ బరిలో ఉండదని ఆయన భావించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మజ్లిస్ తన వ్యూహాలు మార్చుకుంటుండడంతో ముఖేష్ ఇబ్బందుల్లో పడ్డారు. తన నియోజక వర్గంలో అన్ని విధాల అభివృద్ధి చేశానని ఆయన చెబుతున్నారు. ఈ నాలున్నరేళ్ల కాలంలో మైనార్టీతో సైతం ఆయన మమేకయ్యారు. నియోజక వర్గంలో అధిక సంఖ్యలో ఉన్న లోథెలు, లింగాయత్‌లను బీసీల్లో చేర్చడం ద్వారా ఆయన ఆ సామాజిక వర్గాల వారికి మరింత చేరువయ్యారు. అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందని అనుకున్న సమయంలో ముఖేష్‌కు మజ్లిస్ రూపంలో అనుకోని ఆపద వచ్చిపడింది. కొత్తగా దాదాపు 35 శాతం ఓట్లు రావడంతో గెలుపు సునాయాసమని మజ్లిస్ భావిస్తోంది. ఆరునూరైనా తాను అక్కడి నుండే పోటీ చేస్తానని ముఖేష్ ప్రకటించారు. కాంగ్రెస్ టికెట్ లభించకపోతే ఒంటరిగానైనా బరిలోకి దిగుతానన్న ముఖేష్‌కి ఎలాంటి అనుభవం ఎదురవుతుందో చూడాల్సిందే...
Subscribe to:
Posts (Atom)