వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం అవసరమైతే కాంగ్రెస్‌తో దోస్తీ పెట్టుకునే అవకాశాలను సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తోసిపుచ్చలేదు. ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అసరమైతే కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతామని ప్రకటించారు. కాంగ్రెస్‌తో చర్చలు జరిపేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు.
వారితో మేము దోస్తీకి ప్రయత్నించగలమని, వారిని ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వానికి మద్దతివ్వమని కోరుచామన్నారు. ఆచరణలో ఇది సాధ్యమేనని కారత్ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. గత ఏడాది అణు ఒప్పందంపై వివాదంతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వానికి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా దూరమైన ఇరుపక్షాలు మళ్లీ దగ్గరయ్యే అవకాశం లేకపోలేదని తాజాగా కారత్ పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ నేతృత్వాల్లోని కూటములకు ప్రత్యామ్నాయంగా వామపక్ష పార్టీలు ప్రధాన ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి తృతీయ కూటమిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment