ఉగాదిన పీఆర్పీలోకి పెన్మత్స?

విజయనగరం జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో రేగిన అసమ్మతి జ్వాలలు చల్లారకపోగా విపక్షాలకు లాభించేలా సమీకరణలు మారుతున్నాయి. బొత్స కుటుంబానికి మూడు టిక్కెట్లు కేటాయించిన కాంగ్రెస్‌ పార్టీ సందిగ్ధంలో పడింది. జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు తానడిగిన ఎంపీ సీటు ఇవ్వకపోవడతో కాంగ్రెస్‌ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. పెన్మత్సను బుజ్జగించడానికి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకపోయింది. పెన్మత్స ప్రజారాజ్యం పార్టీలో చేరితే తానడిన సీటును ఇవ్వడానికి ఆ పార్టీ సిద్దంగా ఉంది. ఇటు సాంబశివరాజును తమవైపుకు లాగేందుకు తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. తాను ఏ పార్టీలో చేరేది ఉగాది రోజు సాంబశివరాజు పీఆర్పీ వైపు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

No comments:

Post a Comment