మారెప్పకు ఈ సారి హుళక్కే?

వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైంది. ఈ జాబితాలో దాదాపు 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్య పేర్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. టికెట్లు దొరకని ప్రముఖుల్లో మాజీ మంత్రి మారెప్ప ఉండడం విశేషం. మారెప్పతో పాటు చాలామంది మంత్రులకు సైతం ఈ జాబితో చుక్కెదురే ఎదురైనట్లు తెలుస్తోంది. ఇటీవల బీజెపీ నుండి కాంగ్రెస్‌లో చేరిన దొరబాబుకు టికెట్ లభించినట్లు సమాచారం. దేవినేని నెహ్రూకు టికెట్‌ ఖాయమైనా ఏ స్థానంలో బరిలో దించాలన్న విషయం ఇంతవరకు తేలలేదు. మంత్రి కోనేరు రంగారావు తన కుమార్తెకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. మరో మంత్రి గొల్లపల్లి సూర్యారావు టికెట్‌పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో చంగారెడ్డి, కుతుహలమ్మ, కిరణ్‌కుమార్ రెడ్డి, గల్లా అరుణకు టికెట్లు లభించాయి. అయితే తిరుపతిలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పోటీ ఖాయం కావడంతో వెంకటరమణ స్థానంలో టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ చెప్పినట్లు మంత్రులకు సైతం టికెట్లు గల్లంతయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పార్లమెంట్ స్థానాల్లో మాత్రం చాలా మంది సిట్టింగులకు పట్టం కట్టిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment