ముఖేష్ ఇండిపెండెంట్‌గా పోటీ!
నియోజక వర్గాల పునర్విభనకు మంత్రులకు సైతం తలనొప్పిగా మారింది. మంత్రి ముఖేష్‌గౌడ్ కూడా సీటు కోసం నానాతంటాలు పడుతున్నారు. పునర్విభనలో ముఖేష్‌గౌడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజక వర్గం గోషామహల్‌గా ఏర్పడింది. అయితే మజ్లిస్‌కు పట్టున్న కొన్ని ప్రాంతాలు గోషామహల్‌లో చేరడంతో అక్కడి నుండి పోటీ చేయాలని మజ్లిస్ పార్టీ యోచిస్తోంది. మజ్లిస్‌తో రహస్య ఒప్పందం ప్రకారం ఆ పార్టీ బరిలో ఉండదని ఆయన భావించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మజ్లిస్ తన వ్యూహాలు మార్చుకుంటుండడంతో ముఖేష్ ఇబ్బందుల్లో పడ్డారు. తన నియోజక వర్గంలో అన్ని విధాల అభివృద్ధి చేశానని ఆయన చెబుతున్నారు. ఈ నాలున్నరేళ్ల కాలంలో మైనార్టీతో సైతం ఆయన మమేకయ్యారు. నియోజక వర్గంలో అధిక సంఖ్యలో ఉన్న లోథెలు, లింగాయత్‌లను బీసీల్లో చేర్చడం ద్వారా ఆయన ఆ సామాజిక వర్గాల వారికి మరింత చేరువయ్యారు. అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందని అనుకున్న సమయంలో ముఖేష్‌కు మజ్లిస్ రూపంలో అనుకోని ఆపద వచ్చిపడింది. కొత్తగా దాదాపు 35 శాతం ఓట్లు రావడంతో గెలుపు సునాయాసమని మజ్లిస్ భావిస్తోంది. ఆరునూరైనా తాను అక్కడి నుండే పోటీ చేస్తానని ముఖేష్ ప్రకటించారు. కాంగ్రెస్ టికెట్ లభించకపోతే ఒంటరిగానైనా బరిలోకి దిగుతానన్న ముఖేష్‌కి ఎలాంటి అనుభవం ఎదురవుతుందో చూడాల్సిందే...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment