జిల్లా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను స్థానికనేతల అభీష్ఠాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా అభ్యర్థులను ఖరారుచేసింది. జిల్లాలోని 14 అసెంబ్లీస్థానాలలో ఐదు స్థానాలను బీసీలకు కేటాయించింది. సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పిన కాంగ్రెస్ మాటనెరవేర్చుకోలేదు. జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలైన చేవెళ్ల, మల్కాజిగిరిలను స్థానికేతరులైన ఎస్.జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణలకు కట్టబెట్టింది. మహిళల్లో ఒక్క సబితారెడ్డికే టిక్కెట్టు ఇవ్వగా, మైనార్టీలకు మొండిచెయ్యి చూపింది. బీసీల్లో ముదిరాజ్ కులస్థులకే మూడుస్థానాలను కేటాయించింది. బీసీలకు ఐదుస్థానాలను కేటాయించి సముచితస్థానం కల్పించినా మూడుస్థానాల్లో ముదిరాజ్ కులానికి చెందిన వారికి ఇవ్వడంతో మిగతా సామాజిక వర్గాల వారు అసంతృప్తితో ఉన్నారు. మంత్రి సబితారెడ్డిని మహేశ్వరం అభ్యర్థిగా ఖరారుచేయగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎం ప్రతాప్‌ను కుత్బుల్లాపూర్ అభ్యర్థిగా, వికారాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ను మళ్లీ ఖరారుచేసింది. చేవెళ్ల టిక్కెట్‌ను ఊహించని విధంగా టీటీడీ బోర్డు సభ్యుడు కే.యాదయ్యను ఖరారుచేసింది. స్థానికనేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడమే కాకుండా, అన్ని వర్గాలకు ప్రాధాన్యతనివ్వడంలోను అధిష్ఠానం తీవ్ర అన్యాయం చేసిందని, పనిచేసే వారికి కాకుండా బడానేతల ఒత్తిడి మేరకే అభ్యర్థులను ఎంపిక చేశారని కాంగ్రెస్‌నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.జిల్లాలో ఆయా నియోజక వర్గాలకు కేటాయించిన సామాజిక వర్గ వ్యక్తులను ఒకసారి చూద్దాం..
పార్లమెంట్ స్థానాలు
చేవెళ్ల- ఎస్ జైపాల్‌రెడ్డి(రెడ్డి)
మల్కాజిగిరి-సర్వే సత్యనారాయణ(ఎస్సీ,మాదిగ)
అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు
మహేశ్వరం- పి.సబితారెడ్డి(రెడ్డి)
చేవెళ్ల(ఎస్సీ)-కే.యాదయ్య(ఎస్సీ మాదిగ)
తాండూరు-ఎం.రమేష్ ముదిరాజ్ (బీసీ)
పరిగి-కమతం రామిరెడ్డి(రెడ్డి)
వికారాబాద్(ఎస్సీ)-జి.ప్రసాద్‌కుమార్(ఎస్సీ, మాల)
మేడ్చెల్-కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(రెడ్డి)
ఇబ్రహీంపట్నం-మల్‌రెడ్డిరంగారెడ్డి(రెడ్డి)
కుత్బుల్లాపూర్-కేఎం ప్రతాప్‌గౌడ్ (బీసీ)
రాజేంద్రనగర్-బి.జ్ఞానేశ్వర్‌ముదిరాజ్ (బీసీ)
ఎల్‌బీనగర్-దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(రెడ్డి)
శేరిలింగంపల్లి-బిక్షపతియాదవ్(బీసీ)
ఉప్పల్- బి.రాజిరెడ్డి(రెడ్డి)
కూకట్‌పల్లి-వడ్డెపల్లి నర్సింగ్‌రావు(వెలమ)
మల్కాజిగిరి-ఆకుల రాజేందర్ ముదిరాజ్(బీసీ)
No comments:
Post a Comment