మెదక్ లోక్ సభ సీటు ఎవరికి ...?
గత ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన జగ్గారెడ్డి తెలంగాణ ఉద్యమానికి ద్రోహంచేశారని, ఈ సారి ఎన్నికల్లో జగ్గారెడ్డిని చిత్తుగా ఓడించాలని పార్టీ అధినేత కెసీఆర్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భారతీయ జనతాపార్టీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న విజయశాంతి ప్రత్యేక తెలంగాణ నినాదంతో బిజెపికి రాజీనామా చేసి తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడే అన్ని పార్టీలు ఒకే గొడుగు కిందకు రావాలని పిలుపినిచ్చి టీఆర్ఎస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. ఈసారి ఎన్నికల్లో విజయశాంతిని తమ పార్టీ ప్రచారానికి సిద్ధం కావాలని కెసీఆర్ కోరారు. దీనికి విజయశాంతి సిద్ధంగా ఉన్నారని తెలిసింది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో తాను పోటీ చేసి విజయశాంతికి మెదక్ పార్లమెంటు సీటు కేటాయించే ఆలోచనలో కెసీఆర్ ఉన్నారని తెలిసింది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment