మనసు మార్చుకున్న డీఎస్..!
కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. తాజా సమీకరణాలను బట్టి నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిత్వం పిసిసి చీఫ్ ధర్మపురి శ్రీనివాస్‌కు దాదాపు ఖరారైనట్టుగా పార్టీలో జోరుగా ప్రచారం ఊపందుకుంది. నిజామాబాద్ స్థానాన్ని తన రాజకీయ గురువు డిఎస్‌కు ఇచ్చే పరిస్థితుల్లో తనకెలాంటి అభ్యంతరం లేదని ప్రస్తుత ఎంపీ మధుయాష్కీ తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో జహీరాబాద్ కాని భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి అవకాశం కల్పించాలని కూడా కోరినట్లు సమాచారం. లోక్‌సభకు తన శిష్యుడు మధుయాష్కి కాకపోతే తాను రంగంలో ఉండాలని మరెవ్వరికీ అవకాశం ఇవ్వొద్దన్న ఆలోచనలో డీఎస్ ఉన్నట్లు తెలిసింది. మధుయాష్కి అభ్యర్థిత్వంపై సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్నామ్యాయ మార్గాలు అన్వేషిస్తూ స్పీకర్ సురేష్‌రెడ్డి పేరును ప్రతిపాదించడం వల్లనే డిఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. లోక్‌సభకు వెళ్ళాలనుకున్న డిఎస్ గతంలోనే తాను నిజామాబాద్ నుండి పోటీచేస్తానని ప్రకటించారు. అయితే రాష్ట్రంలో మహాకూటమి ఆవిర్భావంతో ఆయన కొద్దిగా వెనుకంజవేశారు. ఇటీవల నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించి లోక్‌సభ ఆశలపై నీళ్ళుచల్లుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడం, పోలింగ్‌కు రోజులుదగ్గరపడుతుండడం.. జాబితాలు పొందుతుండడంతో ఆయన తన మనసు మార్చుకున్నట్లు తెలిసింది. తాను నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి, అర్బన్ స్థానానికి తనయుడు నగర మేయర్ ధర్మపురి సంజయ్‌ను రంగంలోకి దించాలని తుదినిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment