తెలుగు పౌరుషాన్ని మళ్లీ చూప౦డి: ఎన్టీఆర్‌

చైతన్యానికి మారుపేరు తెలుగు ప్రజల... అలా౦టి ప్రజలు నేడు వ౦చనకు గురయ్యారు. దీన్ని సహి౦చక౦డి.... తెలుగు పౌరుషాన్ని తిరిగి చూప౦డి... అవినీతి సర్కారును తరిమికొట్ట౦డి... అని యువహీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ పిలుపునిచ్చారు. ఇచ్చాపుర౦లోని దాసన్నపేటలో జరిగిన రోడ్‌షోలో ఆయన ఆవేశపూరిత౦గా ప్రస౦గి౦చారు. తాను ఓట్లు అడిగే౦దుకు రాలేదని జరిగిన కథను గుర్తు చేయడానికి వచ్చానని ఆయన అన్నారు. ఖాకీ డ్రెస్‌తో మెడపై పసుపచ్చ కండువా వేసుకొని జూనియర్‌ తన తాతను మరిపించారు. ఆకట్టుకునే డైలాగులతో అనర్గళ ప్రసంగం చేసి మొదటి రోజే అభిమానుల చేత శభాష్‌ అనిపించుకున్నారు. తాము ఎన్టీఆర్‌ వారసులమైతే నిజమైన రాజకీయ వారసులు మీరేనని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. తొలిరోజే సర్కారు విధానాలను తనదైన శైలిలో దుయ్యబడుతూ.. ప్రభుత్వం చేస్తుంతా ప్రచారార్భాటమేనని ఆయన విమర్శించారు. విత్తనాలు, ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతన్నలకు లాఠీతో సమాధానం చేప్పిన కాంగ్రెస్‌కు ఓటు ద్వారా బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment