ఈనెల 21వ తేదీన ప్రజారాజ్యం పార్టీ నిర్వహించ తలపెట్టిన ప్రజా విజయభేరికి ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ భేరీని నిర్వహించ తలపెట్టిన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభను నిర్వహించేందుకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నిర్ణయించింది. దీంతో ప్రజారాజ్యానికి అనుమతి ఇంకా లభించలేదని నిర్వహకులు చెపుతున్నారు. దీంతో మరో గ్రౌండ్ కోసం అన్వేషణ ఆరంభించింది.
ప్రధానంగా పెరేడ్ గ్రౌండ్ పక్కనే ఉన్న బైసన్ గ్రౌండ్‌లో విజయభేరి మోగించడానికి తాజాగా ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఈ మైదానాన్ని ఉపయోగించుకోడానికి ఢిల్లీలోని ఎన్.సి.సి హెడ్ క్వార్టర్స్ నుంచి ముందుగా అనుమతి పొందాల్సి వుంది. దీంతో పీఆర్పీ నేతలు ఆగమేఘాలపై ఢిల్లీకి వెళ్ళినట్టు సమాచారం.
అయితే, బైసన్ మైదానానికి ఓ ప్రత్యేకత ఉందట. దానిని సాధారణంగా బహిరంగ సభలకు ఇవ్వరని, 1994లో తెలుగుదేశం మహానాడుకు మాత్రమే ఇచ్చారని చెబుతున్నారు. అప్పుడు బైసన్ గ్రౌండ్‌లో సభ నిర్వహించడం వల్లే ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చారని చెపుతున్నారు. ఈ సెంటిమెంట్‌తో బైసన్ మైదానాన్ని ప్రజా విజయభేరికి వాడుకునేందుకు పీఆర్పీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
No comments:
Post a Comment