బెడిసికొట్టిన మందకృష్ణ వ్యూహం..?

మహాకూటమిలో సీట్ల భేరంతో కొన్ని స్థానాల్లో గెలవచ్చనుకున్న మందకృష్ణమాదిగకు చుక్కెదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మార్పీఎస్‌ మహాకూటమిలో చేరలేదని, కేవలం వారు సీట్లు మాత్రమే కోరారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.కాంగ్రెస్‌కు దూరమైన మందకృష్ణ మహాకూటమితో మంతనాలు సాగించారు. అయితే మందకృష్ణ గొంతెమ్మ కోర్కెలకు నేతలు అంగీకరించలేదు. దీంతో తాము అడిగినట్లు సీట్లు కేటాయించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో పోటీకి దిగతామని మందకృష్ణ డెడ్‌లైన్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మాట్లాడుతూ సీట్ల సర్దుబాబు విషయంతో ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ చేసిన ఆరోపణలతో తమకు సంబంధం లేదని అన్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చించుకోవాలని మందకృష్ణకు సూచించారు. వీరి మాటలను చూస్తుంటే మందకృష్ణ వ్యూహం ఫలించే సూచనలు కనిపించడం లేదు. ఇంతవరకు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఎమ్మార్పీస్ ఎస్సీ వర్గీకరణ విషయంలో బద్ద శత్రువుగా మారారు. మహాకూటమిలో చేరి కొన్ని స్థానాల్లో పోటీ చేసి గెలుద్దామనుకున్నా అదీ నెరవేరేలా కనిపించడం లేదు. ఒంటరిగా బరిలోకి దిగితే కొన్ని ఓట్లను చీల్చవచ్చేమో కానీ ఒక్క సీటు కూడా గెలవకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మందకృష్ణకు ఎలాంటి పరిస్థితి ఎదువుతుందో చూడాలి మరి...

No comments:

Post a Comment