మాదిగ దండోర పోరాట సమితి (ఎం.ఆర్.పి.ఎస్) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మహాకూటమిలో లేరని కూటమి అధినేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వారు మహాకూటమిలో చేరలేదని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేవలం సీట్లు మాత్రమే కోరుతున్నారని అన్నారు.
హైదరాబాద్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మందకృష్ణ ఇచ్చిన అల్టిమేటంపై విలేఖరులు అడిన ప్రశ్నకు పైవిధంగా సమాధానం చెప్పారు. బాలకృష్ణకు దగ్గుపాటి నుంచి ఎవరో కావాలనే లేఖ రాయించారని ఆరోపించారు. తాను వ్యక్తిగత విమర్శలకు సమాధానం చెప్పనని బాబు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు యధేచ్చగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని, ప్రతిపక్షాల ఫోన్‌లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇకపోతే, మహాకూటమిలో మందకృష్ణ ఉన్నారో లేదో ఆయన్నే అడిగి తెలుసుకోవాలని చంద్రబాబు ఘాటుగా సమాధానం ఇచ్చారు.
No comments:
Post a Comment