సీఎం సెంటిమెంట్ కలిసొచ్చేనా!!

ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎన్నికల ప్రచార జైత్రయాత్రను ప్రారంభించారు. సెంటిమెంట్‌ ప్రకారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి సీఎం ప్రచారం ఆరంభించారు. మంగళవారం ఉదయం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, అంబేద్కర్‌, విగ్రహాలకు పైలమాలు వేసి నివాళులు అర్పించిన అనంతరం చేవెళ్లకు బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో అరె మైసమ్మ దేవాలయంలో, చిలుకూరి బాలాజీ క్షేత్రంలో ఆయన పూజలు చేయించారు. చేవెళ్లలో విజయఢంకా మోగించి ఎన్నికల శంఖారావం పూరించారు. ఆ తర్వాత వికారాబాద్‌, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో సీఎం పర్యటనకు బయలుదేరారు. ప్రతిసారి ఏ పథకం ప్రవేశపెట్టిన చేవెళ్ల నుండి ప్రారంభించడం తెలిసిందే. అయితే ఈ సారి ఆ సెంటిమెంట్ ఎంతమేరకు ఫలిస్తుందో చూడాల్సిందే.

No comments:

Post a Comment