లక్ష్మీ పార్వతి వర్సెస్ నన్నపనేని !
తెలుగుమహిళ రోజా, మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణి మాటలు మర్చిపోక ముందే మళ్లీ మహిళా నేతలు విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్‌ను పిల్లకాకి అని అన్న లక్ష్మిపార్వతిపై తెలుగు దేశం అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ ఎలా పదవీచ్యుతుడైంది, ఎవరి వద్ద చనిపోయిందీ అందరికీ తెలుసని రాజకుమారి ఆరోపించారు. లక్ష్మీపార్వతిని కాంగ్రెస్ పార్టీ శిఖండిలా వాడుకుంటోందని ఆమె అన్నారు. చంద్రబాబు వాడుకొని వదిలివేస్తాడని జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణలకు లక్ష్మీపార్వతి సూచించడంపై రాజకుమారి మండిపడ్డారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి పావులా మారారని ఆరోపించారు. శ్రీకాకుళంలో నేరుగా కాంగ్రెస్ పార్టీ సభకు హాజరై బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లపై విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పిల్లకాకి అయితే రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, వైఎస్ జగన్‌లు పిల్ల రాబందులా? అని రాజకుమారి ప్రశ్నించారు.చివరగా ఎన్టీఆర్ మృతికి లక్ష్మీపార్వతే కారణమన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment