EXCLUSIVE: పేరు మార్చుకున్న గబ్బర్‌సింగ్-2

గబ్బర్ సింగ్ అవతారంలో బాక్సాఫీస్ ను షేక్ చేసిన పవన్ కల్యాణ్ మరోసారి అదే ఫీట్ ను రిపీట్ చేసేందుకు సమాయత్తం అవుతున్నాడు. అటు ప్రేక్షకుల్లోనూ ఇటు అభిమానుల్లోనూ ఎంతో క్యూరియాసిటీని క్రియేట్ చేసిన గబ్బర్ సింగ్ -2 గతనెల 29న మహారాష్ట్రలోని మాల్‌షేజ్‌ ఘాట్స్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నేటితో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

గబ్బర్ సింగ్-2 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా... ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇచ్చేందుకు పవర్ ఫుల్ టైటిల్ తో రాబోతోంది....


బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గబ్బర్ సింగ్ -2 చిత్రానికి ‘సర్దార్’ అన్న టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక-నిర్మాతలు... ఈ టైటిల్ పవన్ ఇమేజ్ కు సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పవర్ స్టార్ కు జోడీగా ఇప్పటికే అనీషా ఆంబ్రోస్ ను ఎంపిక చేయగా మరో నాయిక కోసం ఇంకా వెతుకులాట కొనసాగుతోంది. మరి ఈసారి సర్దార్ గా దూసుకు వస్తున్న గబ్బర్ సింగ్... బాక్సాఫీస్ ను మరోసారి షేక్ చేస్తాడో లేదో చూడాలి...

No comments:

Post a Comment