ఎన్నికల హామీలపై తన వ్యాఖ్యలను ఓ ప్రతిక దుర్మార్గంగా వక్రీకరించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లాలోని శీలంవారిపేటలో జన్మభూమి- మాఊరు కార్యక్రమ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాలు ఉన్నా కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నట్లు తాను చెబితే హామీల అమలు కష్టసాధ్యమన్నట్లుగా రాశారని ఆయన అన్నారు.
పేదవారు ప్రమాదంలో చనిపోతే రూ.9లక్షల భీమా ఇప్పించనున్నట్లు స్పష్టం చేశారు. పథకాల అమలులో దళారీ వ్యవస్థ పోవాలన్నారు. ప్రజలు, ప్రభుత్వం మధ్య దళారీ వ్యవస్థ అంతమయ్యేందుకు టెక్నాలజీని పెద్ద ఎత్తున్న వినియోగిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు తమ విజయాలను చంద్రబాబుకు వివరించారు.
No comments:
Post a Comment