పాలనా దక్షుడు, తెలంగాణ ముద్దుబిడ్డ - KCR

తెలంగాణ జాతి సొంత రాష్ర్టాన్ని సాధించుకోవడమే కాదు, ఏడాది పాటు సమర్థవంతమైన పాలన సాగించుకొని విజయగర్వంతో సంబురాలు జరుపుకుంటున్నది. తెలంగాణ ఏర్పడితే ఏమొస్తుందంటూ సవాలు చేసిన వారికి తన కార్యాచరణతోనే దీటైన జవాబునిచ్చింది. ఈ ఏడాదిలో ఏమి జరిగిందని ప్రశ్నించే వారికి సమాధానం- ఏది జరగలేదని!

జాతికి స్వాభిమానమే ఘనమైన సంపద, అస్తిత్వమే ఊపిరి. అందుకే గోల్కొండపై జెండా ఎగుర వేసి తన ఔన్నత్యాన్ని చాటుకొన్నది. ఏ జాతికైనా కళా, సాంస్కృతిక రంగాలే ప్రాణావాయువులు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం కళాకారులను ఉగాది సన్మానాలకు పరిమితం చేయలేదు. కళాకారులను కండ్లకద్దుకొని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది. వారికి ఆత్మగౌరవంతో కూడిన బతుకుకు భరోసా ఇచ్చింది. ప్రజాస్వామ్య ప్రపంచ చరిత్రలో ఇట్లా వందలాది కళాకారులకు ఉపాధి కల్పించిన ఘట్టం ఎక్కడైనా ఉన్నదా? నవజాత శిశువును తల్లి సుకుమారంగా హృదయానికి హత్తుకొని సాదినట్టుగా, తెలంగాణ సమాజం అవసరాలు కనిపెట్టి పథకాలు రూపకల్పన చేయడం, కార్యాచరణకు ఉపక్రమించడం మన ప్రజాప్రభుత్వ గొప్పదనం కాదా!


అహింసాయుతంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం, ఏడాదిలో అతివేగంతో అభివృద్ధి బాటలో సాగడం ఊహకు కూడా అందని అద్భుతం. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఘనత తెలంగాణ సమాజానికి స్ఫూర్తి ప్రదాత అయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. తెలంగాణ బిడ్డలకు తాము సా ధించగలమనే ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వడమే ఆయన సాధించిన మొదటి విజయం. తెలంగాణ రాజకీ య రంగమంతా సీమాంధ్ర తాబేదారులతో నిండిపోయిన దశలో ఇందుకు ప్రత్యామ్నాయంగా స్వీ య రాజకీయ శక్తిని అందించిన మహా నాయకుడు కేసీఆర్. రాష్ట్రం సాధించిన తరువాత కేసీఆర్ పరిపాలనా పగ్గాలు చేపట్టకపోతే ఉద్యమ ఫలం దక్కక పోయేది.

తెలంగాణ తాబేదారులను ముందుబెట్టి తెర వెనుక చక్రం తిప్పుదామని పరాయి పాలకులు కుట్రలు పన్నినప్పుడు వాటిని తుత్తునియలు చేసి, తాను స్వయంగా ఎన్నికల యుద్ధంలో పాల్గొ ని, విజయుడై తెలంగాణ జన హృదయ సింహాసనాన్ని అధిష్టించారాయన. కేసీఆర్ ముఖ్యమంత్రి గా అధికారం చేపట్టకపోతే రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా తెలంగాణ అస్తిత్వం ప్రశ్నార్థకమయ్యే ది. సీమాంధ్ర పెత్తందారులు దురంహంకారంతో నాగార్జునసాగర్ కట్టపైకి పోలీసులను పంపి దౌర్జన్యంగా గేట్లను తెరిపించాలనుకున్నప్పుడు, వారిని ఎదిరించి నిలబడడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సాధ్యమైంది. మహబూబ్‌నగర్ రైతుల డొక్కలు ఎండిపోతున్నా, ఆర్డీఎస్ దగ్గర కట్టకు సొరంగాలు తవ్వుకొని అక్రమంగా నీళ్ళు మలుపుకోవడం సీమాంధ్ర పెత్తందారులకు దశాబ్దాలుగా అలవాటయింది. ఇప్పుడు అధికార పీఠంపై కేసీఆర్ ఉన్నారు... ఈ సీమాంధ్ర పెత్తందారులు ఒక్క చుక్క దొంగిలించగలరా? ఇవాళ గోదావరి, కృష్ణలతో సహా తెలంగాణ నీటి వాటాను దబాయించి అడుగుతున్నామంటే అది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా పరాయి శక్తులు ఇంకా అనేక రంగాలలో కొర్రీలు పెట్టి, ఆటాడాలనుకున్నారు. కానీ ఇప్పుడు వారికి కేసీఆర్ అంటే సింహస్వప్నం. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బకొట్టడం వారి తరం కాదు.

కేసీఆర్ ఉద్యమ నాయకుడే కాదు, పరిపాలనా దక్షుడనేది ఇవాళ ప్రపంచమంతా గుర్తించింది. తెలంగాణ సమాజానికి తక్షణ అవసరాలేమిటో గుర్తించి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మౌలిక సమస్యలు తీర్చడానికి వీలుగా దీర్ఘకాలిక పథకాలు అమలు పరుస్తున్నారు. ఆంధ్రా బాబులు ఎంత ఇబ్బంది పెట్టినా బెదరకుండా, ఏడాది తిరిగేలోగా విద్యుత్ సమస్య తీర్చడం ఇతరులకు అసాధ్యం. ఐదేండ్లలో ఇంటింటికీ మంచి నీటిని అందించి పాదాలు కడగక పోతే ఓట్లు అడగబోనని చెప్పడం మరే నాయకుడికైనా సాధ్యమా! భారీ నీటిపారుదల ప్రాజెక్టులు రూపొందిస్తూనే, అతివేగంగా చెరువుల తవ్వకాన్ని సాగించడం, అదీ అవినీతికి తావు లేని రీతిలో నడిపించడం కేసీఆర్ సమర్థతకు నిదర్శనం. అరవై ఏండ్ల పాలనలో దోపిడీ సాగిన మాట నిజమే. ఇప్పుడు ఒకే తరంలో ఆ నష్టాన్ని పూడ్చుకొని నిలబడడం ఎట్లా అనేది కేసీఆర్ ఆలోచన. దళితులకు భూమి, కేజీ టు పీజీ వంటి పథకాలు ఈ ప్రగతిశీల దృక్పథం నుంచి ఉద్భవించినవే. వీటి ఫలితాలు పునాదులు నిర్మిస్తున్నప్పుడు తెలువదు. కానీ మన కండ్ల ముందే ఒక కొత్తతరం అవతరించి ఆత్మవిశ్వాసంతో తలెత్తుకొని నిలబడ్డనాడు కేసీఆర్ దార్శనికత ఏమిటో బోధపడుతుంది. ఇవాళ తెలంగాణలోని ప్రతి కుటుంబం తమ బతుకుపై, పిల్లల భవిష్యత్తుపై దిగులు పడకుండా, కేసీఆర్ ఉన్నాడనే ధీమాతో హాయిగా నిద్రిస్తున్నది. అదీ పరిపాలనాదక్షుడిగా ఈ ఏడాది కాలంలో కేసీఆర్ సాధించిన విజయం.

అరవై ఏండ్ల పాలనలో దోపిడీ సాగిన మాట నిజమే. ఇప్పుడు ఒకే తరంలో ఆ నష్టాన్నిపూడ్చుకొని నిలబడడం ఎట్లా అనేది కేసీఆర్ ఆలోచన. దళితులకు భూమి, కేజీ టు పీజీ వంటి పథకాలు ఈ ప్రగతిశీల దృక్పథం నుంచి ఉద్భవించినవే. వీటి ఫలితాలు పునాదులు నిర్మిస్తున్నప్పుడు తెలువదు. కానీ మన కండ్ల ముందే ఒక కొత్తతరం అవతరించి ఆత్మవిశ్వాసంతో తలెత్తుకొని నిలబడ్డనాడు కేసీఆర్ దార్శనికత ఏమిటో బోధపడుతుంది.

No comments:

Post a Comment