రాష్ట్ర౦ దళారులకు భోజ్య౦
రాష్ట్ర౦ దళారులకు భోజ్య౦గా మారి౦దని, కాంగ్రెస్ పెద్దలు దళారులుగా మారి పేదల కడుపుకొడుతున్నారని సినీనటులు నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. ఇలాంటి దళారుల పాలనకు కంటిచూపుతో అంతం చేయాలని ఆయన తెలుగుదేశం నాయకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. రోడ్డుషోలో బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసమే స్వర్గీయ నందమూరు తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. హరిజన, గిరిజన సామాజిక వర్గాలను గుర్తించి వారికి కేటగిరిలు కేటాయించటం జరిగిందన్నారు. మహిళలను అసెంబ్లీ స్వీకర్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. అప్పటిలో ఉన్న తాలుకాలను గ్రామాలకు దూరంగా ఉండటంతో మండలాలు పెట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజు రోజుకు ఆరచకాలు,రౌడీయిజం ఎక్కువగా జరుగుతుందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం వంటి పథకాలలో నాయకులకే తప్ప సరైన అర్హులకు దక్కటంలేదన్నారు. తెలుగుదేశం హయాంలో పెట్టిన రైతు బజారులను ఈ ప్రభుత్వం దళారుల బజారులుగా వారి రాజ్యంగా మార్చుకున్నారన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment