మరో యాభై ఏళ్లలో ప్రపంచ జనాభా 9 బిలియన్లను చేరే అవకాశముందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. అలగే వచ్చే 2012 నాటికి ప్రపంచ జనాభా ఏడు బిలియన్లను చేరుకుంటుందని సమితి తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు పెరుగుతున్న జనాభాలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు ఈ సందర్భంగా సమితి అభిప్రాయపడింది.
ఈ విషయమై ఐక్యరాజ్యసమితిలోని ఎకనామిక్ అండ్ సోషియల్ అఫైర్స్ డిపార్ట్‌మెంటుకు చెందిన పాపులేషన్ డివిజన్ డైరెక్టర్ హనియా జ్లోట్నిక్ మాట్లాడుతూ భారత్, అమెరికా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర తొమ్మిది దేశాలు వచ్చే 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం శాతాన్ని ఆక్రమిస్తాయని చెప్పారు.
తమ గణాంకాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 9.1 బిలియన్లకు చేరుకుంటుందని ఆమె పేర్కొన్నారు. అదేసమయంలో వచ్చే 50ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా మహిళల సంతానోత్పత్తి శాతం సరాసరిగా
No comments:
Post a Comment