ప్రజలందరికి తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ పరమ పవిత్రం. కానీ ఓటుకు నోటు కుంభకోణంలో అడ్డంగా బుక్కయిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాత్రం ఈ సమస్య నుంచి బయటపడేందుకు లడ్డూను వాడుకున్నారు. పాప పరిహారం కోసం పాట్లు పడ్డారు. ఎంతో పవిత్రమైన లడ్డూ గురించి ప్రతికూలంగా స్పందించడం బాధాకరమైనా, ఓటుకు నోటు కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయిన ఏపీ సీఎం.. తిరుపతి లడ్డూతో తన పాపాలు కడిగేసుకునేందుకు సెంటిమెంట్ రాజకీయం నడిపారు. ఢిల్లీ పెద్దల కరుణ కటాక్షాల కోసం వెళ్లిన బాబు, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మొదలు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడులకు పుష్పగుచ్చాలతోపాటు ఒక కవర్‌లో తిరుపతి లడ్డూలు సమర్పించుకున్నారు.
అవినీతి గండం నుంచి గట్టెక్కేందుకు ప్రధాని మొదలు కేంద్రమంత్రులను కలిసి తన గోడు చెప్పుకున్న చంద్రబాబు.. తెలంగాణ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేసిందని, కుట్రపూరితంగా రాజకీయంగా ఇరికించేందుకు స్టింగ్ ఆపరేషన్ చేసిందని, ఏపీ ప్రతిష్ఠకు భంగం కలిగించిందని తదితర ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఇవే అంశాలు చెప్పినట్లు స్వయంగా మీడియాకు చెప్పుకున్నారు. కానీ కేంద్ర పెద్దలందరినీ కలిసినా ఉపశమనం లభించకుండానే హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు.
No comments:
Post a Comment