మహబూబ్‌నగర్‌లోని ఊడలమర్రికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. అది జగమెరిగిన మర్రి! కాని ఇక్కడ ఊడలజడలను జారవిడిచి కనిపిస్తున్న ఈ మర్రి గురించి పెద్దగా తెలుసుండకపోవచ్చు చాలామందికి! దీని పేరు ఊడలమర్రి.. నివాసం.. మహబూబనగర్జిల్లాలోని కొందుర్గమండలం.. పెద్ద ఎల్కిచర్ల గ్రామం..ఎల్లీరన్న ఊడలమర్రిగా ప్రాచుర్యంలో ఉన్నది!
ప్రశాంతమైన అటవీ ప్రాంతం.. దట్టమైన ఊడలతో ఎకరాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ ఊడల మర్రిని పాలమూరు జిల్లాలో మరో పిల్లలమర్రిగా పిలుస్తారు. అంతేకాదు ఇక్కడ ఎల్లీరన్నస్వామి విగ్రహస్థాపనతో ఈ ప్రదేశం మహిమాన్వితమైంది. అయితే ఈ ప్రాంతానికి నడిచే దారి లేక.. పట్టించుకునేవారు కానరాక.. పర్యటక స్థలంగా మారే అవకాశం ఉన్నా.. అజ్ఞాతం అనుభవిస్తోంది!
SPECIAL REPORT: భువనైక సౌందర్యం - భువనగిరి
చారిత్రక ప్రాధాన్యమున్న భువనగిరి ప్రకృతి సౌందర్యానికి, సాహస కృత్యాలకు కూడా నెలవు. 600 అడుగుల ఎత్తున్న ఈ ఏకశిలా నగరిని ఎక్కితేనే మనకు ఈ అందాలన్నీ కనబడతాయి. హైదరాబాద్‌కు 45 కిలోమీటర్ల దూరంలో భువనగిరి పట్టణం మధ్యలో ఉన్న ఈ బృహత్ శిలపైనా అలాగే చుట్టుపక్కలా ఉన్న దర్శనీయ స్థలాలను చదివి వీక్షిస్తే అదొక అనిర్వచనీయమైన ఆనందం, అనుభూతి.
దక్షిణ భారతదేశంలో దక్కను పీఠభూమి సహజమైన ఏకశిలా పర్వతాలకు ప్రత్యేక నిలయం. అలాంటి ఏకశిలా పర్వతాల్లో మైసూరు పీఠభూమి పైనున్న నందికొండ తర్వాత చెప్పుకోదగిన ఎత్తయిన పర్వతం భువనగిరి. ఈ తరువాత స్థానంలో పేర్కొనదైన వరంగల్‌లోని ఏకశిల ఏకంగా యావత్ తెలుగుదేశానికి 150 సంవత్సరాలు రాజధానిగా వర్ధిల్లింది.
దక్షిణ భారతదేశంలో దక్కను పీఠభూమి సహజమైన ఏకశిలా పర్వతాలకు ప్రత్యేక నిలయం. అలాంటి ఏకశిలా పర్వతాల్లో మైసూరు పీఠభూమి పైనున్న నందికొండ తర్వాత చెప్పుకోదగిన ఎత్తయిన పర్వతం భువనగిరి. ఈ తరువాత స్థానంలో పేర్కొనదైన వరంగల్‌లోని ఏకశిల ఏకంగా యావత్ తెలుగుదేశానికి 150 సంవత్సరాలు రాజధానిగా వర్ధిల్లింది.
తెలంగాణ సినిమా సాంస్కృతిక విప్లవానికి నాందిబందూక్
బాహుబలిలాంటి సినిమాలు డబ్బులున్నవారు ఎవరైనా తీయొచ్చు. కానీ బందూక్లాంటి సినిమా తీయాలంటే తెలంగాణ బ్రతుకుపోరాటం తెలిసుండాలి. ఈ బందూక్ తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకలా శత్రువుల గుండెల్లో పేలుతుంది. తెలంగాణ సినిమాలో ఓ సాంస్కృతిక విప్లవానికి నాంది పలుకుతుంది. తెలంగాణ సమాజం పట్ల గొప్ప బాధ్యతతో తీసిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రానికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయసహకారాలు అందేలా చూస్తాను అన్నారు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సారథి రసమయి బాలకిషన్. పూర్తిగా తెలంగాణ కళాకారులు, సాంకేతిక నిపుణులతో బి.బి.ఎస్.స్టూడియో మోషన్ పిక్చర్స్ సంస్థ రూపొందించిన చిత్రం బందూక్.
మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా?!
ఉప్పేస్కో.. నూనేస్కో.. ఎగ్గేస్కో.. స్వీట్కార్నేస్కో..! మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా.. వాటి వాడివేడి నాటు దెబ్బ సూద్దువా? మేఘాలన్నీ కమ్మేసుకున్నాయ్.. మబ్బుల్లోంచి చిరుజల్లులు రాలుతున్నాయ్.. ఈ చల్లచల్లని ఎట్మాస్పియర్లో.. వేడివేడి మొక్కజొన్న కంకులు తింటే ఎట్లా ఉంటుంది? మొక్కజొన్న వెరైటీలను ఈ రెయినీ సీజన్లో టచ్ చేయాలని నోరూరుతుందా?
లేట్ చేస్తే నోటికాడి స్వీట్‌కార్న్ వానదొంగలు ఎత్తుకెళ్లినా ఆశ్చర్యం లేదు. వెళ్లి స్వీటు కార్న్ నాటు రుచి చూడండి!
లేట్ చేస్తే నోటికాడి స్వీట్‌కార్న్ వానదొంగలు ఎత్తుకెళ్లినా ఆశ్చర్యం లేదు. వెళ్లి స్వీటు కార్న్ నాటు రుచి చూడండి!
Subscribe to:
Posts (Atom)